: మహిళా నేరాల్లో మహారాష్ట్ర మగువలదే పైచేయి


దేశవ్యాప్తంగా మహారాష్ట్ర మహిళలే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నారని 'నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో' (ఎన్ సీఆర్ బీ) ప్రకటించింది. గత మూడేళ్లలో మహిళల నేరాల రేటుపై ఆరా తీసిన క్రైమ్ రికార్డ్స్ బ్యూరో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2010 నుంచి 2012 వరకు, మూడేళ్ల పాటు జరిగిన నేరాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు మహారాష్ట్రలో మహిళా నేరస్థుల సంఖ్య ఎక్కువగా ఉందని తేల్చారు. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం మహారాష్ట్రలో 90,884 మంది మహిళలు పలు నేరాల్లో అరెస్టయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో 57,406, మధ్యప్రదేశ్ లో 49,333 తమిళనాడులో 49,066, గుజరాత్ లో 41,872 కేసులు నమోదయ్యాయి.

భారత దేశంలో ఈ మూడేళ్ల కాలంలో 93 లక్షల అరెస్టులు జరిగాయని అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు చేసినవి 94 శాతం ఉంటే మహిళా నేరాలు కేవలం 6 శాతం ఉండడం విశేషం. మహారాష్ట్రలో జరిగిన అరెస్టుల్లో ఎక్కువ శాతం భార్యా భర్తల గొడవ(20,000)కు సంబంధించినవి కావడం విశేషం. దీనికితోడు... అల్లర్లలో 16,843 మంది, దెబ్బలాటల్లో 15,348 మంది, దొంగతనాల్లో 3,911 మంది, హత్యా నేరాల్లో 1900 మంది, హత్యాయత్నాల్లో1700 మంది మహిళలు అరెస్టయ్యారని క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.

  • Loading...

More Telugu News