: పెళ్లి కుమారుడి వాహన శ్రేణిపై తీవ్రవాదుల దాడి : 30 మంది మృతి
వివాహానంతరం తిరిగి వెళుతున్న పెళ్లి కుమారుడి వాహన శ్రేణిపై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నైజీరియాలోని బోర్నో రాష్ట్రంలో జరిగింది. ఈ దాడిలో వరుడు సహా ముప్పై మంది చనిపోయారని తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతంలో బొకో హరామ్ తీవ్రవాదుల స్థావరముందని.. కాబట్టి, ఈ ఘటనకు పాల్పడింది కూడా వారేనని అనుమానిస్తున్నారు. ఫిర్గీ గ్రామంలో వివాహ వేడుక ముగించుకుని పెళ్లి కొడుకు, మిగతావారు వస్తుండగా ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.