: హైదరాబాద్ లో నవంబర్ 4 నుంచి ప్రపంచ వ్యవసాయ సదస్సు
ప్రపంచ స్థాయి సదస్సులకు హైదరాబాద్ ఇప్పుడు కేంద్ర స్థానంగా మారింది. గతేడాది జీవవైవిధ్య సదస్సుకు ఆతిథ్యమిచ్చిన హైదరాబాద్ తాజాగా ప్రపంచ వ్యవసాయ సదస్సుకు ముస్తాబు కానుంది. ఈ సదస్సు నవంబర్ 4 నుంచి వరకు జరగనుంది.
ఈమేరకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిఖ్ అన్వర్ బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కన్నాలక్ష్మీనారాయణ, పలువురు ఎంపీలు, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి హాజరయ్యారు.