: దీపావళి వేడుకలపై మిలిటెంట్ల కాల్పులు.. ఏడుగురు మృతి
అసోంలోని గోల్పరా జిల్లాలో దీపావళి వేడుకల్లో రక్తం చిందింది. జిల్లాలోని జెండామరి ప్రాంతంలో దీపావళి వేడుకలు జరుపుకుంటున్న బృందంపై రాత్రి 9 గంటల సమయంలో, 'గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీ'కి చెందిన మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వారిని గోల్పరా ఆస్పత్రికి తరలించారు.