: గుంటూరులో కాంగ్రెస్ కార్యాలయం ముట్టడికి యత్నం
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర రాష్ట్ర విద్యార్థి జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గుంటూరులో విద్యార్థి జేఏసీ నేతలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని వారు హెచ్చరించారు. డీసీసీ కార్యాలయం ఎదురుగా ఉన్న మార్కెట్ కూడలి రహదారిపై బైఠాయించి తమ నిరసన తెలిపారు. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఆందోళన చేస్తున్న విద్యార్ధి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.