: నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్.. ఫ్రీగా మొబైల్ రీచార్జ్
ఓ విద్యార్థి తెలివి వెర్రితలలు వేసింది. లెక్చరర్ పేరుతో ఫేస్ బుక్ ప్రొఫైల్ తెరిచాడు. స్టూడెంట్స్ కు మెస్సేజులు పంపించాడు. నా మొబైల్ కు రీచార్జ్ చేయండర్రా.. అంటూ మొబైల్ బ్యాలెన్స్ నింపుకోవడం మొదలెట్టాడు. తీరా ఒక విద్యార్థికి సందేహం వచ్చి అసలు లెక్చరర్ కు ఫేస్ బుక్ గురించి చెప్పాడు. దీంతో ఆ లెక్చరర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతపురం పట్టణంలో ఓ ప్రైవేటు కళాశాల ఉపాధ్యాయుడి పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇంత నాటకమూ ఆడాడు. అయితే, విద్యార్థులు పంపిన రీచార్జ్ కూపన్ నంబర్లు ఏ నెంబర్ కు వినియోగించారో చెప్పాలని లెక్చరర్ కోరగా నెట్ వర్క్ డీలర్ నిరాకరించడంతో ఆయన త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.