: వణికిస్తున్న మూడు చిరుతలు


మహబూబ్నగర్ జిల్లా, దేవరకద్ర మండలం గద్దెగూడెం గ్రామస్థులను చిరుత పులులు వణికిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూడు చిరుతలు సంచరిస్తూ.. గ్రామంలోకి ప్రవేశించి పశువులపై దాడి చేస్తున్నాయి. ఇప్పటికే చిరుత దాడిలో ఓ ఆవు మృతి చెందింది. దీంతో చిరుతపులులు ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో? అన్న భయంతో గ్రామస్థులు ఉలిక్కిపడుతున్నారు. చిరుత పులులు తిరుగుతున్నట్లు అటవీ శాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News