: జీవోఎంకు లేఖ ఇవ్వకూడదని టీడీపీ నిర్ణయం!


కేంద్ర మంత్రుల బృందానికి (జీవోఎం) లేఖ ఇవ్వకూడదని టీడీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. విభజనపై కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. దీనికితోడు, ఇదే విషయాన్ని లేఖ ద్వారా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో, జీవోఎంను టీడీపీ పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విషయం అర్థమవుతోంది. రెండు భేటీల తర్వాత కూడా జీవోఎం... విభజనకు సంబంధించిన విధివిధానాలపై పార్టీల నుంచి అభిప్రాయాలు కోరడం రాజకీయం కాదా? అని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో, కాసేపట్లో సీమాంధ్ర నేతలతో బాబు సమావేశమవుతున్నారు. అలాగే, సాయంత్రం టి.టీడీపీ నేతలతో భేటీ అవుతారు. అనంతరం తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

  • Loading...

More Telugu News