: సీమాంధ్రలోనూ వైఎస్సార్సీపీ జెండా పీకేస్తారు : మల్లు రమేష్


తెలంగాణ విభజన కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందాన్ని (జీవోఎం) తాము అంగీకరించడం లేదని వైఎస్సార్సీపీ పేర్కొనడాన్ని 'భారతీ ఏక్తా ఆందోళన్' కన్వీనర్ మల్లు రమేష్ తప్పుబట్టారు. జీవోఎంను బహిష్కరిస్తూ ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం ద్వంద్వ నీతికి నిదర్శనమని విమర్శించారు. ఇడుపులపాయ సమావేశంలో తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రకటించి, ఇప్పుడు జీవోఎంను బహిష్కరించడం సరికాదన్నారు. జీవోఎంకు వెళ్లకుంటే సీమాంధ్రలోనూ ఆ పార్టీ జెండా పీకేస్తారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News