: బట్టతలకు భూమ్యాకర్షణ కూడా కారణమట!


మగాళ్లను వేధించే సమస్యల్లో బట్టతల ఒకటి. దీనికి వైద్యులు పలు కారణాలను చెబుతుంటారు. అయితే వీటితోబాటు, బట్టతల ఆరంభం కావడానికి భూమ్యాకర్షణ శక్తి కూడా కారణమయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురుషుల శరీరంలోని టెస్టోస్టిరాన్‌లో మార్పులు కూడా మరో కారణమని అమెరికా పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.

పురుషుల్లోని టెస్టోస్టిరాన్‌లో మార్పుల వల్ల తలపై కొన్ని భాగాల్లో జుట్టు ఊడిపోతుందని, హార్మోన్లలోని ఈ మార్పును డిహైడ్రోటెస్టోస్టిరాన్‌ అంటారని పరిశోధకులు చెబుతున్నారు. డీహెచ్‌టీగా పిలిచే ఈ మార్పువల్ల తలపై ఉండే చర్మంలో కొవ్వు మోతాదు తగ్గడం వల్ల ఒత్తిడిని తట్టుకోలేక జుట్టు ఊడిపోతుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. అయితే ఇలా తలపై కాకుండా శరీరంలోని ఇతర భాగాల్లో వచ్చే వెంట్రుకల విషయంలో మాత్రం డీహెచ్‌టీ పాత్ర విభిన్నంగా ఉంటుందని, దీనికితోడు ఇతర పురుష హార్మోన్ల వల్ల అక్కడి వెంట్రుకల కింద చర్మం మందంగా తయారవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు పెరిగేకొద్దీ చర్మం సాగిపోయి, దానికింద ఉండే కొవ్వు తగ్గిపోవడంతో వెంట్రుకలు ఊడిపోతాయని, దీనికి పురుషుల్లోని టెస్టోస్టిరాన్‌ కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయంలో మహిళల్లో వెంట్రుకలు ఊడిపోకుండా ఈస్ట్రోజన్‌ నివారిస్తుందని, వారిలో మెనోపాజ్‌ వరకైనా ఈ పరిస్థితి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News