: ఇలాంటి వాటివల్ల లైంగిక వాంఛలు తగ్గుతాయట!
మనం తినే ఆహారంలో కొన్ని చిన్న మార్పులను చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. కొన్ని ఆహార పదార్ధాలను అతిగా తీసుకోవడం వల్లనే మనం అనారోగ్యం బారిన పడుతుంటాం. కొన్ని మన లైంగిక జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతాయి కూడా. ఇలాంటి వాటిల్లో కొన్నింటిని మరీ అతిగా కాకుండా తక్కువగా తీసుకుంటే మేలని నిపుణులు చెబుతున్నారు. మనం తినే స్వీట్స్ విషయంలో కృత్రిమ తీపిని అందించే పదార్ధాలను తగ్గించుకోవాలి. వీటిలో ఆస్పార్టేమ్ అనే పదార్ధం ఉంటుంది. ఇది మన శరీరంలోని హార్మోన్ల అసమతూకాన్ని కలిగిస్తుంది. ఫలితంగా మూడ్ మారిపోతుంది, లైంగిక వాంఛల్ని తగ్గిస్తుంది. ఇలాంటి వాటికి బదులుగా బెల్లం, తేనె లాంటివి తీసుకుంటే మంచిది. అలాగే చీజ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయే టాక్సిన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టెరాన్ హార్మోన్లను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా లైంగిక వాంఛలు తగ్గుతాయి.
ఎక్కువమంది ఇష్టంగా తినే ఆహారపదార్ధాల్లో చిప్స్‌ని ప్రధానంగా చెప్పుకోవచ్చు. కరకరలాడే చిప్స్‌ని చూస్తే ఎవరికైనా నోరూరుతుంది. వీటిని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఎక్కువ కొవ్వు పేరుకుంటుంది. తాజాగా నిర్వహించిన అధ్యయనాల ప్రకారం ఇది కణాలు, కణజాలం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. లైంగిక వాంఛల్ని పరోక్షంగా తగ్గిస్తాయి. అలాగే కొందరు కప్పుల కొద్దీ కాఫీ లాగించేస్తుంటారు. రోజుకు రెండు మూడు కప్పుల కాఫీ తాగితే మంచిదే. కానీ ఎక్కువ కాఫీ తాగడం వల్ల శరీరంలోని హార్మోన్లపై ఒత్తిడి పెరిగేందుకు కారణమవుతుంది. ఫలితంగా హార్మోన్ల అసమతూకం కారణంగా లైంగిక వాంఛలు తగ్గుతాయి. ఇంకా కూల్‌డ్రింక్స్ ఎక్కువ తాగితే కూడా లైంగిక వాంఛలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.