: ఆడవారి గుండె చాలా బలహీనం!
సాధారణంగా షుగరు వ్యాధి వున్నా వాళ్లకి త్వరగా గుండె జబ్బులు వస్తాయి. ఇందులో పురుషులతో పోల్చుకుంటే ఆడవారికే గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం చెబుతోంది. షుగరు వ్యాధి ఉన్న వారిలో ముఖ్యంగా ఆడవారిలోనే గుండె జబ్బులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉందని, షుగరు వల్ల మగవారికన్నా, ఆడవారికే ఎక్కువ ప్రమాదమని తాజా అధ్యయనం చెబుతోంది.
అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు సుమారు పదివేలమందిపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాన్ని తేల్చారు. వీరు నిర్వహించిన పరిశోధనలో ఆడవాళ్లు, మగవాళ్లని సమాన పరిమాణంలో తీసుకుని పరిశోధన చేశారు. వీరి పరిశోధనలో షుగరు ఉన్న మగవారితో పోలిస్తే ఆడవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం నాలుగు రెట్లు ఎక్కువగా ఉందని తేలింది. అందులోను అధిక రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు ఉంటే ఈ ప్రమాదం మరింతగా పెరుగుతుందని చెబుతున్నారు. అంతేకాదు, ఇప్పుడు పద్దెనిమిదేళ్ల అమ్మాయిల్లో కూడా టైప్-2 మధుమేహం ఎక్కువగా కనిపిస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.