: ఇలా చేసి చూడండి... బరువు తగ్గిపోతారు!


మీరు బరువు తగ్గి, సన్నబడాలనుకుంటున్నారా... అయితే ఇలా చిన్న మార్పులు చేసి చూడండి. ఎక్కువ బరువుండేవారు బరువు తగ్గడానికి తెగ ప్రయత్నిస్తుంటారు. ఆహారం తీసుకోవడం మానేయడం కాకుండా పరిమితంగా పోషకాలను కలిగిన ఆహారం తీసుకుంటూ, రోజూ ఉదయాన్నే వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం అనగానే జిమ్‌లకు వెళ్లడం కాదు... ఇంట్లోనే మీరు వ్యాయామం మొదలుపెట్టవచ్చు.

ఏ వ్యాయామాన్నైనా వార్మప్‌తో మొదలుపెట్టాలి. శరీరాన్ని విల్లులా అటూ ఇటూ వంచుతూ ప్రారంభించాలి. అలాగే మొదటిరోజునే శరీరానికి చెమటలు పట్టేలాగా, ఆయాసం వచ్చేలాగా జాగింగ్‌ చేయడం కాకుండా చిన్న పరుగుతో మొదలుపెట్టి, తర్వాత కాస్త వేగాన్ని పెంచాలి. మన బరువును అదుపులో ఉంచడంలో ఎక్కువగా ఉపకరించే ఈతకు బరువు తగ్గడంలో ఎక్కువ ప్రాధాన్యతనివ్వచ్చు. ఈత వల్ల శరీర బరువు తగ్గుతుంది. దీనిని మన శరీరంలోని ప్రతి భాగానికి మంచి వ్యాయామంగా చెప్పవచ్చు. అంతేకాదు, ఈత మనసుకి కూడా హాయినిస్తుంది.

అలాగే రోజూ అరగంట పాటు సైకిల్‌ తొక్కడం కూడా మంచిదే. సైకిల్‌ తొక్కడం వల్ల ఐదు వందల కేలరీలను కరిగించుకోవచ్చు. అమ్మాయిలకు చేతులు, కాళ్లూ నాజూకుగా తయారుకావడానికి బాగా ఉపకరించే వ్యాయామం తాడాట. అమ్మాయిలకు ఎంతో అనువైన ఈ తాడాటను రోజూ చేయడం వల్ల కాళ్లూ, చేతులు నాజూకుగా తయారవుతాయి. ఇలా చిన్న చిన్న వ్యాయామాలతో మన శరీర బరువును చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.

  • Loading...

More Telugu News