: కాంగ్రెస్ తో ఒప్పందం వల్లే జగన్ కు బెయిలు: బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
కాంగ్రెస్ తో వైఎస్సార్ సీపీకి ఒప్పందం కుదరడం వల్లే జగన్ కు బెయిల్ వచ్చిందని లోకమంతా అనుకుంటున్నారని టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ యూపీఏకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతివ్వమని చెప్పే ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. సమైక్య వాదం ముసుగులో విభజన జరగాలని కోరుకునే పార్టీ వైఎస్సార్ సీపీ అని ఆయన ఆరోపించారు.