: రాష్ట్రపతిని కలవనున్న జగన్
వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అపాయింట్ మెంట్ లభించింది. హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో ఎల్లుండి జరుగనున్న ఐపీఎస్ ల పరేడ్ కు హాజరయ్యేందుకు రాష్ట్రపతి రేపు సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీని వైఎస్సార్ సీపీ అధినేత జగన్ రేపు రాత్రి 9 గంటలకు కలువనున్నారు. ఈ సందర్భంగా జగన్ భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని రాష్ట్రపతిని కోరనున్నారు.