: సచిన్ స్థానాన్ని రోహిత్ భర్తీ చేస్తాడు: బెయిలీ
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా కెప్టెన్ జార్జ్ బెయిలీ ప్రశంసల వర్షం కురిపించాడు. సచిన్ టెండూల్కర్ లేని లోటును టీమిండియాకు రోహిత్ భర్తీ చేస్తాడని తెలిపాడు. రోహిత్ శైలి మిగిలిన వారికి భిన్నంగా ఉందని, నెమ్మదిగా ఆటను ప్రారంభించిన రోహిత్ జోరు పెంచుతూ పోయి విరుచుకుపడతాడని అన్నాడు. ఈ లక్షణం తనను బాగా ఆకట్టుకుందని, రోహిత్ ఆటతీరును దగ్గర్నుంచి పరిశీలించిన వ్యక్తిగా సచిన్ స్థానాన్ని అతను భర్తీ చేస్తాడని బెయిలీ తెలిపాడు. చూడచక్కనైన ఆటతో ఆకట్టుకునే రోహిత్, షాట్ల ఎంపికలో అసాధారణ ప్రతిభ ఉందని బెయిలీ అన్నాడు.