: యోగి వేమనగా మారిన సీఐ


రాష్ట్ర విభజనపై మేధావులుగా పేరొందిన వారంతా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రాల పునర్విభజన స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సాక్షాత్తూ ప్రభుత్వాధికారులే ప్రభుత్వ కుటిల నీతిని, రాజకీయ ప్రయోజనాలను దుయ్యబడుతున్నారు. ఉద్యమాలు చేసే వారిని ఈడ్చుకెళ్లే పోలీసుల నుంచి కూడా ఒక ఉద్యమకారుడు పుట్టుకొచ్చాడు. ఒక పోలీసధికారి ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ సమైక్యవాదాన్ని వినిపిస్తున్నాడు. రాజమండ్రి అర్బన్ సీఐగా విధులు నిర్వర్తిస్తున్న యార్లగడ్డ జగదీశ్వరరావు కడియం మండలం వేమగిరికొండపై బుద్ధ విహార్ తెలుగు పందిరిలో వేమన విగ్రహం దగ్గర అచ్చం వేమనలాగే కూర్చుని నిరసన తెలిపారు.

ఈ అభినవ వేమన సమైక్య ఉద్యమంలో చురుగ్గా ఉపన్యాసాలిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన సందర్భంగా విభజిస్తే ప్రాణత్యాగం చేస్తానని ప్రకటించి సస్పెండయ్యారు. తరువాత విధుల్లో చేరిన ఆయన సమైక్యత విలువ రాజకీయ నాయకులకు తెలియడం లేదని, 'మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పి చూడ పురుగులుండు' అన్నట్టు మనరాజకీయ నాయకుల తీరు ఉందని ఆయన మండి పడుతున్నారు.

  • Loading...

More Telugu News