: నర్సు ఆపరేషన్... బాలింత మృతి!
కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో నర్సులు చేసిన నిర్వాకానికి బాలింత బలైపోయింది. ఓ నిండు గర్భిణిని ఆమె బంధువులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో డాక్టర్ ఆసుపత్రిలో లేరు. దీంతో ఇద్దరు నర్సుల సాయంతో స్టాఫ్ నర్సు ఆపరేషన్ చేసేసింది. కవలలు జన్మించారు. అయితే, తరువాత మహిళకు విపరీతమైన రక్త స్రావం జరగడంతో ఆమె మృతి చెందింది. దీంతో మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం వల్లే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తున్నారు.