: తెలంగాణ, సీమాంధ్ర కాంగ్రెస్ నేతలతో సీఎం, బొత్స భేటీ
రాష్ట్ర విభజన అంశంపై రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ మంత్రులు, నేతలతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం 4.30 నిమిషాలకు సీమాంధ్ర మంత్రులు, నేతలతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, బొత్సలు భేటీ అవుతారు. జీఎంవోతో అఖిల పక్షం సమావేశానికి పంపాల్సిన నోట్ పై ఈ భేటీలో ఇరు ప్రాంత నేతలతో సమాలోచనలు చేయనున్నారు.