: మహిళను బలిగొన్న దీపావళి
దీపావళి ఓ మహిళను బలిగొంది. హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఎవరో పేల్చిన తారాజువ్వ ఎగసి వచ్చి గుడిసెపై పడి మంట రాజేసింది. దీంతో గుడిసెలో ఉన్న నాగమణి సజీవ దహనమైంది. ఘటనా స్థలాన్ని ఆర్డీవో, తహసీల్దార్, టీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. మృతురాలి కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.