: వెలవెలబోతున్న బాణసంచా దుకాణాలు
రాష్ట్రంలోని పలు నగరాల్లో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలు వెలవెలబోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడు టపాసులపై 20 శాతం ధర పెరిగింది. దీంతో ప్రతి ఏడాది ఘనంగా చేసుకునే నగర జీవులు ఈ ఏడాది అటువేపు చూడటంలేదు. కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు శబ్ద, వాతావరణ కాలుష్యంపై అవగాహన కల్పించడంతో పాటు స్కూళ్లలో ప్రతిజ్ఞ చేయించడంతో దీపావళి పెద్ద సందడిగా లేదు. నిత్యావసరాలు పెరగడంతో పాటు, టపాసుల ధరలు కూడా పెరగడంతో బాణసంచా దుకాణంవైపు వెళ్లేందుకు కూడా నగర జీవి ఆసక్తి చూపడం లేదు.