: కన్నడ దర్శకుడు రాజేంద్రబాబు మృతి
ప్రముఖ కన్నడ దర్శకుడు డి.రాజేంద్రబాబు (62) గుండెపోటుతో ఈ ఉదయం బెంగళూరులో కన్నుమూశారు. కడుపులో నొప్పి రావడంతో ఆయనను శనివారం సాయంత్రం బెంగళూరులోని రామయ్య ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఉదయం తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు. రాజేంద్రబాబు నటన నుంచి దర్శకుడిగా మారారు. 50చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. జిడ్డు, యుగపురుష, అన్నయ్య చిత్రాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టాయి.