: నన్ను ముద్దాడాలంటే ఆరు నెలలు ఆగాల్సిందే: వీణామాలిక్
బోయ్ ఫ్రెండ్స్ తో తన బంధాల గురించి సెక్సీ తార వీణా మాలిక్ కొన్ని వివరాలను తెలియజేసింది. ప్రతీ అనుబంధానికీ ఓ అర్థం ఉంటుందని చెప్పింది. తనకు ఎవరితోనైనా అనుబంధం ఏర్పడితే శారీరక సంబంధానికి మొదటి ఏడాది అవకాశం ఇవ్వనని, కనీసం కిస్ చేయాలన్నా ఆరు నెలల సమయం పడుతుందని తెలిపింది. ముందుగా ఆ వ్యక్తిని అర్థం చేసుకోవడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పింది. తనకు ఎంతో మంది బోయ్ ఫ్రెండ్స్ ఉన్నా అందరితోనూ ఆ సంబంధాన్ని కలిగి లేనని, నిజాయతీ, విశ్వాసం రిలేషన్ లో ఎంతో ముఖ్యమని వీణా పేర్కొంది.