: హైదరాబాద్ లో ఘనంగా దీపావళి వేడుకలు
హైదరాబాద్ లో దీపావళి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయాలకు భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. నగర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వనస్థలిపురం, దిల్ షుక్ నగర్, చాదర్ ఘాట్, నల్లకుంట, కూకట్ పల్లి, ఖైరతాబాద్, ఫిల్మ్ నగర్ లలో లక్ష్మీదేవిని ప్రత్యేక పూజలు, హోమాలతో కొలిచారు. బాలలు ఉదయం నుంచే టపాసులు కాలుస్తూ పండగను చేసుకున్నారు. టపాసుల ధరలు ఆకాశాన్నంటడంతో పరిధి మేరకు పండగను చేసుకుంటున్నారు.