: జగన్ ఆదరణ చూసి కాంగ్రెస్, టీడీపీలు భయపడుతున్నాయి: అమరనాథ్ రెడ్డి
వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న స్పందనను చూసి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు భయపడుతున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి తెలిపారు. కడపలో ఆయన మాట్లాడుతూ, వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న వైఎస్ విజయమ్మను కుట్ర, కుతంత్రాలతో అడ్డుకున్నారని అన్నారు. ఈ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలతో తప్పుదారులు వెతుక్కుంటున్నాయని ఆయన విమర్శించారు.