: లైంగికారోపణల కేసులో శ్వేతామీనన్ వాంగ్మూలం సేకరణ
లైంగికారోపణల కేసులో మలయాళ నటి శ్వేతామీనన్ వాంగ్మూలాన్ని పోలీసులు ఈ రోజు నమోదు చేసుకున్నారు. కొల్లామ్ లో పడవ పోటీల సందర్బంగా కాంగ్రెస్ ఎంపీ ఎన్.పీతాంబర కురుప్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని శ్వేతామీనన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఉదయం 9 గంటలకు కోచిలోని శ్వేతా మీనన్ నివాసానికి వెళ్లిన పోలీసుల బృందం ఆమె నుంచి వివరాలు సేకరించింది. పీతాంబరతోపాటు, మరో వ్యక్తిని నిందితులుగా శ్వేతా పేర్కొంది. మరోవైపు సంఘటనపై పూర్తి వివరాలతో కూడిన ఫిర్యాదును ముఖ్యమంత్రి ఊమెన్ చాందీకి పంపించాలని శ్వేత నిర్ణయించింది. నిన్న రాత్రి మలయాళ చిత్ర ప్రముఖులతో సమావేశం అనంతరం ఆమె ఈ నిర్ణయానికి వచ్చింది.