: బంగారం అమ్మకాలు ఎందుకు తగ్గాయి?


బంగారం అమ్మకాలకు ప్రభుత్వం కళ్లెం వేసింది. భారతీయుల పండగల్లో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే పండగంటే చాలు, కాస్త స్థోమత ఉన్న మహిళలంతా బంగారం షాపుల్లో ప్రత్యక్షమవుతారు. ప్రతి ఏడాది దీపావళికి, ధంతేరాస్ (ధనత్రయోదశి)కి కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరిగేవి. కానీ గత కొంత కాలంగా ప్రభుత్వం బంగారం కొనవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తుండడానికి తోడు, బంగారంపై కేంద్ర ప్రభుత్వం పన్ను పెంచడంతో, బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. దాంతో వినియోగదారులు బంగారానికి కాస్త దూరం జరిగారు. అందుకే, ఈ ఏడాది బంగారం అమ్మకాలు లేక షాపులు వెలవెలబొయాయి.

  • Loading...

More Telugu News