: నాకు తగినవాడు ఇంకా కనిపించలేదు: ప్రియాంకచోప్రా


తాను పెళ్లి చేసుకోవడానికి తగిన ప్రత్యేక వ్యక్తి ఇంకా కనిపించలేదని బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా స్పష్టం చేసింది. సమీప కాలంలో పెళ్లి చేసుకునే అవకాశం లేదని తెలిపింది. ప్రియాంక తమ్ముడు సిద్ధార్థ్ చోప్రా వివాహం ఇటీవలే నిశ్చయమైంది. దీంతో ప్రియాంక తన పెళ్లిపై స్పందించింది. తాను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వడానికి తగినవాడు ఇంకా తారసపడలేదని తెలిపింది. కుటుంబ సభ్యుల నుంచి పెళ్లి చేసుకోవాలంటూ తనపై ఒత్తిడి లేదని వెల్లడించింది.

  • Loading...

More Telugu News