: కన్నతండ్రి కాదు... వీడు కీచకుడు!..
దారుణాలు పెరిగిపోతున్నాయి. వావివరుసలు మరిచిన కిరాతకులు కన్నూ మిన్నూ కానక దారుణాలకు తెగబడుతున్నారు. ఓ కామాంధుడు తానే జన్మనిచ్చానన్న విషయం మరిచి, తండ్రి అన్న పదానికే కళంకం తెచ్చాడు. వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని థానేలోని కసరవాడవల్లిలో నివాసముంటున్న ఓ ఇల్లాలు తన 13 ఏళ్ల కుమార్తె ఆచూకీ రెండేళ్లుగా తెలియడం లేదని, దానికి కారణం తన భర్తే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని తమదైన పద్దతిలో విచారించిన పోలీసులు భయంకరమైన నిజాన్ని తెలుసుకున్నారు. అతనే ఆ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారానికి తెగబడుతున్నాడని తేలింది.
దీంతో ఆ బాలికను అతడి చెర నుంచి విడిపించి విచారించిన పోలీసులకు, ఆ బాలిక గత రెండేళ్లుగా తన తండ్రే తనను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడుతున్నాడని తెలిపింది. దీంతో అతడిపై కిడ్నాప్, అత్యాచారం కింద పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసి మెజిస్ట్రేటు ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేటు అతడికి నవంబరు 12 వరకు రిమాండు విధించారు.