: ఐబీఎంకు రూ. 5,357 కోట్ల ట్యాక్స్ నోటీస్
అమెరికాకు చెందిన ప్రముఖ బహుళజాతి ఐటీ కంపెనీ ఐబీఎం 5,357కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టాలని ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. 2009 ఆర్థిక సంవత్సరంలో ఆదాయాన్ని తక్కువ చేసి చూపినందుకుగాను ఈ మేరకు పన్ను కట్టాలని నోటీసులలో పేర్కొన్నారు. నోటీసులను అందుకున్నట్లు ఐబీఎం కంపెనీ భారత విభాగం ప్రతినిధి అంగీకరించారు. చట్టబద్దంగా దీన్ని ఎదుర్కొంటామని ప్రకటించారు.