: ఆ నిబంధనే బాదుడుకి తోడ్పడింది: రోహిత్
ఆసీస్ తో జరిగిన చివరి వన్డేలో రోహిత్ శర్మ బ్యాట్ తో విధ్వంసం సృష్టించడానికి ఆ నిబంధనే తోడ్పడిందట. సర్కిల్ లోపలే ఐదుగురు ఫీల్డర్లను మోహరించడమన్న నిబంధన తాను అంత స్కోరు చేయడానికి సాయపడిందని తెలిపాడు. వెస్టిండీస్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ లో మిడిలార్డర్ లో ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. రోహిత్ వన్డేలలో 3000 పరుగుల మైలు రాయిని అధిగమించాడు.