: పాకిస్థానీ గాయని రేష్మా కన్నుమూత


కొన్నాళ్లుగా గొంతు కేన్సర్ తో బాధపడుతూ చికిత్స పొందుతున్న ప్రముఖ పాక్ జానపద గాయని రేష్మా ఈ ఉదయం లాహోర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. 1947లో రాజస్థాన్ లోని బికనీర్ లో బంజారా కుటుంబంలో రేష్మా జన్మించారు. దేశ విభజన అనంతరం ఆమె కుటుంబం కరాచీలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. జానపద గాయనిగా రేష్మా పాకిస్థానీయుల హృదయాలలో స్థానాన్ని సంపాదించుకున్నారు.

  • Loading...

More Telugu News