: రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ 64/2


ఆస్ట్రేలియా రెండో వికెట్ కోల్పోయింది. 12 ఓవర్లకు తొలి వికెట్ నష్టానికి 64 పరుగులు చేసిన ఆస్ట్రేలియాను అశ్విన్ 13 ఓవర్ తొలి బంతికే దెబ్బతీశాడు. హ్యూస్(23) ను తొలి ఓవర్ తొలి బంతికే బలిగొన్నాడు. అశ్విన్ వేసిన తొలి బంతిని స్క్వేర్ లెగ్ దిశగా తరలించి రన్ తీద్దామన్న హ్యూస్ ఆశలకు యువీ అడ్డంపడ్డాడు. స్క్వేర్ లెగ్ దగ్గరే కాచుకుని ఉన్న యువీ తొందర పడకుండా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని ఒడిసి పట్టుకుని అవుట్ చేశాడు. దీంతో ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. కీపర్ హడిన్(35) కు కెప్టెన్ బెయిలీ జత కలిశాడు.

  • Loading...

More Telugu News