: రూ. 5.7 లక్షల ఫోన్ విడుదల
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను నోకియా మార్కెట్లోకి విడుదల చేసింది. నోకియా లగ్జరీ బ్రాండ్ విర్చూ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను ఇంగ్లాండ్ లోని హామ్ప్ షేర్ లో రూపొందించారు. కాగా దీని ధర 7 వేల డాలర్లపై మాటే. అంటే మన కరెన్సీలో ఈ ఫోన్ ధర 5 లక్షల 70 వేల రూపాయలు. 5.1 అంగుళాల స్క్రీన్ చుట్టూ 100 సఫైర్ క్రిస్టల్స్ తో డిజైన్ చేసిన ఈ ఫోన్ బాడీని టైటానియంతో తయారు చేశారు. అందువల్ల బరువుగా ఉండదని నోకియా చెబుతోంది. కేవలం లగ్జరీ క్లాస్ వినియోగ దారుల కోసం మాత్రమే ఈ ఫోన్ తయారు చేశామని నోకియా కంపెనీ చెబుతోంది.