: భారత్ లో హిందూ తాలిబానిజం చెల్లదు: దిగ్విజయ్
భారత్ లో హిందూ తరహా తాలిబానిజం విజయవంతం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. మోడీ, బీజేపీని లక్ష్యంగా చేసుకుని దిగ్విజయ్, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు, వ్యాఖ్యానాలు చేస్తున్న క్రమంలోనే తాజా వ్యాఖ్యలు కూడా డిగ్గీ రాజా నుంచి వెలువడ్డాయి. తాలిబాన్ తరహా సిద్ధాంతాలను తాను మెచ్చనని ఆయన అన్నారు. భారత్ లో హిందూ తరహా తాలిబాన్ ను తాను అంగీకరించనని చెప్పారు. పటేల్ వారసత్వాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించిన మోడీ ఏదో ఒక రోజు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లను ఆర్ఎస్ఎస్ ప్రచారకులుగా పేర్కొనే అవకాశం కూడా ఉందంటూ దిగ్విజయ్ చురకంటించారు.