: నిందితుడిని చితగ్గొట్టి.. అర్ధ నగ్నంగా జీపెక్కించిన పోలీసులు
అనంతపురం పట్టణంలో పోలీసులు చేసిన పని తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పోలీసుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఆరోపణలున్న నిందితుడిని పట్టుకుని నడిరోడ్డుపై చితకబాది, అర్దనగ్నంగా జీపెక్కించి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. దీంతో స్థానికులు పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడి రోడ్డుమీద చితకబాది ఏ సందేశమిస్తున్నారని మండిపడుతున్నారు. పోలీసులు ఇలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.