: తలస్నానానికి మినరల్ వాటర్ కోరిన మల్లికా శరావత్
బాచిలరెట్ ఇండియా కార్యక్రమం ద్వారా మొగుడిని వెతుక్కునే పనిలో ఉన్న మల్లికా శరావత్.. తలస్నానానికి మినరల్ వాటర్ కోరిందట. ఈ షో షూటింగ్ లో భాగంగా జైపూర్ లోని ఒక స్టార్ హోటల్లో ఉన్న మల్లిక వారు సరఫరా చేస్తున్న నీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిగా మారుతోందని, ప్రత్యేకంగా మినరల్ వాటర్ తీసుకొచ్చి పెట్టండి అంటూ ఆర్డరేసిందట. మల్లిక ఇలాంటి డిమాండ్లు పెట్టడం షరా మామూలేనని తెలిసిన వారు అనుకుంటున్నారు.