: జీఎంవోను వ్యతిరేకిస్తున్నాం: మంత్రి పితాని
రాష్ట్ర విభజనపై ఏర్పడిన జీఎంవోను వ్యతిరేకిస్తున్నట్టు మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం ఆగిపోలేదని, ఆత్మవిశ్వాసంతో పని చేస్తున్నామని అన్నారు. విభజనకు సహకరించాలంటూ వేసే ఏ కమిటీనైనా తాము వ్యతిరేకిస్తామని మంత్రి పితాని స్పష్టం చేశారు.