: హకీముల్లా హత్యకు ప్రతీకారంగా తీవ్ర దాడులు చేస్తాం : పాక్ తాలిబన్
తమ నేత హకీముల్లా మసూద్ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్థాన్ తాలిబన్లు హెచ్చరించారు. ఇకపై కనీవినీ ఎరుగని రీతిలో దాడులు చేస్తామని తాలిబన్ కమాండర్ 'అబు ఒమర్' వార్నింగ్ ఇచ్చారు. హకీముల్లాపై జరిగిన దాడిలో పాకిస్థాన్ ప్రభుత్వం కూడా భాగస్వామేనని ఆయన అన్నారు. మా శతృవుల గురించి మాకు పూర్తిగా తెలుసని చెప్పారు. హకీముల్లా హత్యానంతరం జరగబోయే పరిణామాలపై న్యూయార్క్ టైమ్స్ కూడా ఒక కథనాన్ని ప్రచురించింది. రానున్న రోజుల్లో తాలిబన్ల వల్ల నెత్తురు ఏరులై పారే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.