: నో క్రాకర్స్.. బెంగళూరులో 6లక్షల చిన్నారుల ప్రతిజ్ఞ
చీకట్లను పారదోలి జీవితాలను వెలుగు మయం చేసేదే దీపావళి. దీపాల వెలుగుతో ప్రతీ ఇల్లు దేదీప్యమానంగా ప్రకాశించే రోజు. కానీ, దీపాలు తగ్గి టపాకాయల వాడకం పెరిగిపోవడంతో.. జేబులతో పాటు చెవులకు, పర్యావరణానికి చిల్లులు పడడం పెరిగిపోయింది. దీపావళి రోజున క్రాకర్ల వల్ల వాయు కాలుష్యం పెద్ద ఎత్తున పెరిగిపోతోందని పర్యావరణ ప్రేమికులు నెత్తినోరూ బాదుకుంటున్నారు.
కర్ణాటక కాలుష్య నియంత్రణ బోర్డు ఈసారి చిన్నారులలో మార్పు తెచ్చేందుకు ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో 6 లక్షల మంది చిన్నారులు పర్యావరణ ప్రయోజనకరంగా దీపావళి పండుగను జరుపుకోవడానికి అంగీకరించారు. వారిప్పుడు దీపాల వెలుగులోనే ఆనందాన్ని వెతుక్కోవడానికి సిద్ధమయ్యారు. అందరూ వారి బాటనే నడిస్తే అది ఎంతో మార్పును తీసుకొస్తుంది. మన ఆరోగ్య దీపాలను వెలిగిస్తుంది.