: టీడీపీలో చేరాలని ఒత్తిడి వస్తోంది: జేసీ ప్రభాకర్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన వోల్వో బస్సు ప్రమాదంపై సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని దివాకర్ ట్రావెల్స్ అధినేత, కాంగ్రెస్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. టీడీపీలో చేరాలని తనపై, తన అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డిపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అన్న మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడరని, తాను మాత్రం ఆలోచిస్తానని ఆయన చెప్పారు. ప్రమాదానికి గురైన వోల్వో బస్సు దివాకర్ ట్రావెల్స్ పేరుమీదే నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ బస్సును జబ్బార్ ట్రావెల్స్ కు లీజుకు ఇచ్చామని జేసీ ప్రభాకర్ రెడ్డి లోగడే లీజు పత్రం చూపించారు.