: మ్యాచ్ కు మోకాలడ్డిన వరుణుడు.. భారత్ 107
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగుతున్న భారత్, ఆస్ట్రేలియా ఏడో వన్డేకు కాస్సేపు వరుణుడు మోకాలడ్డాడు. 17 ఓవర్లు పూర్తి కాగానే స్టేడియంలో ఒక్కసారిగా జడివాన పడింది. దీంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. వాతావరణం సాధారణంగా ఉన్నప్పటికీ వర్షం అంతరాయం కలిగించడం క్రీడాభిమానులను అసహనానికి గురి చేసింది. వర్షంతో మ్యాచ్ నిలిచి పోయే సమయానికి భారత స్కోరు 17 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 107 పరుగులు. ధావన్ 58 పరుగులతోనూ రోహిత్ శర్మ 37 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.