: అన్నా డీఎంకే వెబ్ సైట్లను హ్యాక్ చేసిన పాక్


తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన రెండు వెబ్ సైట్లను పాకిస్థాన్ హ్యాకర్లు హ్యాక్ చేశారు. 'ఎఐఏడీఎంకే ఆలిండియా.ఆర్గ్', 'జయాటివి.టివి' అనే రెండు వెబ్ సైట్లను 'పాక్ హ్యకర్స్ క్రూ' అనే బృందం హ్యాక్ చేసింది. ఈ రెండు వెబ్ సైట్లకు చెందిన హోం పేజీలను వారు పూర్తిగా మార్చేసి హస్నైన్133@జిమెయిల్. కామ్ అనే అడ్రస్ ను అందులో ఉంచారు. ఈ సైట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించే వారికి సైట్ యాక్సిస్ రిస్ట్రిక్టెడ్ అని వస్తోంది. కాగా జయాటివి.టివి అనేది తమ అధికారిక సైట్ కాదని, 'జయన్యూస్ లైవ్.ఇన్', 'జయానెట్ వర్క్.కామ్' అనేవి తమ వెబ్ సైట్లని అవి బాగానే ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • Loading...

More Telugu News