: ముజఫర్ నగర్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత


ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ముజఫర్ నగర్ లోని మహ్మద్ పూర్ రాయిసింగ్ గ్రామంలో గత నెల 30న చోటు చేసుకున్న అల్లర్లలో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఈ ప్రాంతంలో పారామిలటరీ బలగాలు, పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ముజఫర్ నగర్ ఎస్పీ హెచ్ఎం సింగ్ తెలిపారు. ముగ్గురు మృతి చెందిన ఘటనలో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News