: బలరాం నాయక్ అనుచరుల ఆందోళన
వరంగల్ డీసీసీబీ ఛైర్మన్ రాఘవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ... కేంద్ర మంత్రి బలరాం నాయక్ అనుచరులు ఆందోళన చేశారు. ఈ ఘటన ఈ రోజు వరంగల్ లో చోటుచేసుకుంది. ఈ నెల 9న వరంగల్ లో జరిగే కృతజ్ఞత సభకు సన్నాహక సమావేశాన్ని హన్మకొండలోని డీసీసీ భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంలో కేంద్ర మంత్రి అనుచరులు హల్ చల్ చేశారు. ఆందోళన మధ్యలోనే వారు సమావేశం నుంచి వెళ్లిపోయారు.