: ఎంపీ అసభ్యంగా ప్రవర్తించారు: శృంగార తార శ్వేతామీనన్
లోక్ సభ సభ్యుడు పీతాంబరం కురుప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని... తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో శృంగార తారగా పేరొందిన శ్వేతా మీనన్ ఆరోపించింది. నిన్న సాయంత్రం కేరళలోని కొల్లాంలో జరిగిన పడవల పోటీ విజేతలకు ప్రెసిడెంట్స్ ట్రోఫీ బహుమతి ప్రధానోత్సవంలో శ్వేతా మీనన్ తో పాటు కొల్లాం లోక్ సభ సభ్యుడు పీతాంబరం కురుప్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపట్ల ఎంపీ ప్రవర్తించిన తీరుపై శ్వేతామీనన్ వీడియో పుటేజీలను విడుదల చేసింది. దీంతో ఆయన పట్ల చర్యలు తీసుకోవాలంటూ మాలీవుడ్ తో బాటు, పలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
దీనిపై పీతాంబరం స్పందిస్తూ, మీడియాలోని ఓ వర్గం తనపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఆ సంఘటన ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని తన అమాయకత్వాన్ని నిరూపించుకుంటానని తెలిపారు. శ్వేతామీనన్ ఆరోపణలను సుమోటోగా స్వీకరించి విచారణ చేపడతామని కేరళ మహిళా హక్కుల కమీషన్ అధ్యక్షురాలు లిసీజోస్ వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.