: తెలంగాణ బిల్లును గెలిపిస్తాం : రాజ్ నాథ్ సింగ్


తెలంగాణ విషయంలో బీజీపీ వెనకడుగు వేయదని ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెడితే వంద శాతం గెలిపిస్తామని తనను కలసిన తెలంగాణ బీజేపీ నేతలకు ఆయన హామీ ఇచ్చారు. ఈ రోజు ఢిల్లీలో తెలంగాణ ప్రాంత బీజేపీ నేతలు రాజ్ నాథ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో, సుష్మా స్వరాజ్ ను నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని రాజ్ నాథ్ ను తెలంగాణ నేతలు కోరారు.

  • Loading...

More Telugu News