: కరుణానిధిని కలిసిన కేంద్ర మంత్రి చిదంబరం
కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం డీఎంకే అధినేత కరుణానిధిని చెన్నైలో కలిశారు. శ్రీలంకలో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు హాజరవ్వాలా? లేదా? అనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన కరుణానిధికి తెలిపారు. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, దీనిపై ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.