: బాణసంచా పేలుడు.. 11 మంది మృతి
చైనాలోని బీజింగ్ లో ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఎక్కువగా మహిళలు ఉన్నట్టు సమాచారం. కాగా, మన దేశంలో దీపావళి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. పర్యావరణ వేత్తలు పండుగను పర్యావరణానికి హాని కలగని రీతిలో జరుపుకోవాలని సూచించారు.