: ప్రమాదానికి కారణం పేలుడు కాదేమో... వోల్వో సంస్థ


మహబూబునగర్ జిల్లా పాలెం దగ్గర సంభవించిన వోల్వో బస్సు ఘోరప్రమాదానికి... డీజిల్ ట్యాంకు పేలుడే కారణమై ఉండొచ్చని భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, వోల్వో బస్సుకు అమర్చిన డీజిల్ ట్యాంకులు పేలవని వోల్వో సంస్థ తెలిపింది. వోల్వో బస్సులకు అమర్చినవి లోహపు ట్యాంకులు కావని... ఇవి రోటో మౌల్డెడ్ ప్లాస్టిక్ ట్యాంకులని వోల్వో ప్రతినిధులు తెలిపారు. ఒత్తిడి కారణంగా మెటల్ ట్యాంకుల మాదిరి కాకుండా... ఇది నొక్కుకుపోతుందని అన్నారు. అప్పుడు కూడా ఇది పేలదని చెప్పారు. భారత రోడ్లపై వేలాది వోల్వో బస్సులు తిరుగుతున్నాయని... డీజిల్ ట్యాంకులు పేలి మంటలు అంటుకున్నట్టు తమ దృష్టికి ఇంకా రాలేదని తెలిపారు. అయినా మహబూబ్ నగర్ లో జరిగిన ప్రమాదంపై తమ ఇంజినీర్లు దర్యాప్తు చేస్తున్నారని... ప్రమాద కారణాలను కనుక్కుంటామని చెప్పారు.

  • Loading...

More Telugu News